AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు.. కానీ!

అనుకున్నట్లుగానే జరిగింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులను కూడా ఇచ్చింది. ఇక నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక పాస్‌లు అక్కర్లేదని తెలిపింది. అయితే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అక్కడున్న పరిస్థితుల బట్టి అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం విధించుకోవచ్చునని.. ఆ విషయంపై ప్రజలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని కేంద్రం […]

గుడ్ న్యూస్.. పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు.. కానీ!
Ravi Kiran
|

Updated on: May 31, 2020 | 3:54 PM

Share

అనుకున్నట్లుగానే జరిగింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులను కూడా ఇచ్చింది. ఇక నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక పాస్‌లు అక్కర్లేదని తెలిపింది. అయితే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అక్కడున్న పరిస్థితుల బట్టి అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం విధించుకోవచ్చునని.. ఆ విషయంపై ప్రజలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని కేంద్రం సూచించింది.

కాగా, జూన్ 30 వరకు కేంద్రం విధించిన లాక్ డౌన్ మూడు దశలుగా ముగియనుంది. మొదటి దశలో జూన్ 8 నుంచి ప్రార్ధనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకోనున్నాయి. రెండోదశలో(జూలై 20 తర్వాత) విద్యాసంస్థలను తెరిచే అంశంపై అప్పటి పరిస్థితి బట్టి కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇక మూడోదశలో మెట్రో సర్వీసులు, థియేటర్లు, పబ్‌లు, అంతర్జాతీయ విమానలు,స్విమ్మింగ్ పూల్స్,పార్క్‌లు, జిమ్‌ల రీ-ఓపెన్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రతీ ఒక్కరూ కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని కూడా కేంద్రం తగ్గించింది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి