ముంబై.. కరోనా మహిళా రోగి పట్ల డాక్టర్ అత్యాచార యత్నం

ముంబై.. కరోనా మహిళా రోగి పట్ల డాక్టర్ అత్యాచార యత్నం

ఓవైపు కరోనా రోగులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ లా సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందిస్తూ ఆదివారం దేశ వ్యాప్తంగా సాయుధ దళాలు జెట్ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా వారిపై పూల జల్లులు కురిపిస్తే.. మరోవైపు అలాంటి డాక్టర్లలోనే చీడపురుగు వంటివారు కూడా ఉన్నారని తెలుస్తోంది. ముంబైలో కరోనా సోకి.. ఐసీయులో ఉన్న 44 ఏళ్ళ మహిళా రోగి పట్ల ఒక డాక్టర్ అత్యాచార యత్నానికి  పాల్పడిన ఉదంతం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాను డ్యూటీలో […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 6:32 PM

ఓవైపు కరోనా రోగులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ లా సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందిస్తూ ఆదివారం దేశ వ్యాప్తంగా సాయుధ దళాలు జెట్ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా వారిపై పూల జల్లులు కురిపిస్తే.. మరోవైపు అలాంటి డాక్టర్లలోనే చీడపురుగు వంటివారు కూడా ఉన్నారని తెలుస్తోంది. ముంబైలో కరోనా సోకి.. ఐసీయులో ఉన్న 44 ఏళ్ళ మహిళా రోగి పట్ల ఒక డాక్టర్ అత్యాచార యత్నానికి  పాల్పడిన ఉదంతం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాను డ్యూటీలో చేరిన మరుసటిరోజే 34 ఏళ్ళ ఈ డాక్టర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కనీసం నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యురాలన్న కనికరం కూడా లేకుండా  ఆమె పట్ల కీచకుడే అయ్యాడు. షాక్ తిన్న ఆమె కేకలు పెట్టడంతో ఇతర వైద్య సిబ్బంది  వఛ్చి అతడ్ని పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కీచక డాక్టర్ ని పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేయబోవడం లేదు. కరోనా రోగితో కాంటాక్ట్ లో ఉన్నాడు గనుక అతడిని అరెస్ట్ చేయడంలేదని, హోం క్వారంటైన్ కి తరలించామని ఖాకీలు చెప్పారు. అతడి క్వారంటైన్ కాలం ముగిసినవెంటనే అరెస్ట్ చేస్తామన్నారు. ఇలాంటి వారు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారని, తమ ఆసుపత్రి పేరు చెప్పని మరో వైద్యుడు అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu