మీరు వింటున్న ‘కరోనా కాలర్ ట్యూన్’ గొంతుక ఈమెదే

ఇంతకీ ఆ గొంతుక ఎవరిదో తెలుసా? సమాజ హితాన్ని కోరుతూ తయారు చేసిన ఈ కాలర్ ట్యూన్‌కు తన గొంతుకను అరువిచ్చారు విశాఖ పట్నానికి చెందిన పద్మావతి. తాజాగా కరోనా కాలర్ ట్యూన్ గురించి పద్మావతి మాట్లాడుతూ..

మీరు వింటున్న 'కరోనా కాలర్ ట్యూన్' గొంతుక ఈమెదే
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 5:45 PM

కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ‘కోవిడ్-19 జాగ్రత్త చర్యల’ కాలర్ ట్యూన్ వస్తుంది. ఇంకా ఈ వ్యాధి తొలి రోజుల్లో అయితే పొడి దగ్గుతో కాలర్‌ ట్యూన్ మొదలయ్యేది. ఈ కాలర్ ట్యూన్ విని మొదట అందరూ షాక్‌ అయ్యారు. ఇటీవలే టెలికాం సంస్థలు దగ్గుకు సంబంధించిన ఆడియో భాగాన్ని కత్తిరించాయి. దీంతో ఈ ట్యూన్ ఇప్పుడు నిమిషం పాటు వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని తెలుగు కాలర్‌ట్యూన్ మార్మోగుతుంది.

ఇంతకీ ఆ గొంతుక ఎవరిదో తెలుసా? సమాజ హితాన్ని కోరుతూ తయారు చేసిన ఈ కాలర్ ట్యూన్‌కు తన గొంతుకను అరువిచ్చారు విశాఖ పట్నానికి చెందిన పద్మావతి. తాజాగా కరోనా కాలర్ ట్యూన్ గురించి పద్మావతి మాట్లాడుతూ.. నాకు కాలర్ ట్యూన్‌ని హిందీలో ఇచ్చారు. దానిని నేనే తెలుగులోకి అనువదించుకున్నా. ఉన్నది ఉన్నట్టు చెబితే.. ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి భావం చెడకుండా మార్పులు చేసి 30 సెక్లన నిడివి ఉండేలా వాయిస్‌ ఓవర్ ఇచ్చినట్లు పద్మావతి తెలిపారు.

కాగా కరోనా గురించి రక్షణ చర్యలు తీసుకోవటంపై రెండు రకాల కాలర్ ట్యూన్‌లు ఇచ్చారు పద్మావతి. ఒకటి వ్యాధిపై అవగాహన. రెండోది.. వైద్యులను, పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలంటూ మరో కాలర్ ట్యూన్ చేశారు. వైజాగ్‌లో డిగ్రీ చేసిన పద్మావతి ఢిల్లీలో ఉంటున్నారు. ఈమె భర్త డీవీ ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కాగా దాదాపు పదేళ్ల నుంచి పలు కార్యక్రమాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే రేడియో కార్యక్రమాలకు పద్మావతినే వాయిస్ ఓవర్ ఇస్తూంటారు.

Read More:

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్