కరోనాపై టిక్‌టాక్‌లో వెకిలిచేష్టలు.. కట్‌ చేస్తే అతనికే కోవిడ్ సోకింది

టిక్‌టాక్‌లో మాస్కులను ఎగతాళి చేస్తూ వీడియోలు చేసిన ఓ యువకుడికి కరోనా వైరస్ సోకింది. ఇతను మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన యువకుడు. పైగా 'దేవుడిని నమ్ముకోండి.. మాస్కులను కాదు' అంటూ టిక్‌టాక్‌లో...

కరోనాపై టిక్‌టాక్‌లో వెకిలిచేష్టలు.. కట్‌ చేస్తే అతనికే కోవిడ్ సోకింది
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 12:38 PM

టిక్‌టాక్‌లో మాస్కులను ఎగతాళి చేస్తూ వీడియోలు చేసిన ఓ యువకుడికి కరోనా వైరస్ సోకింది. ఇతను మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన యువకుడు. పైగా ‘దేవుడిని నమ్ముకోండి.. మాస్కులను కాదు’ అంటూ టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన సమీర్ ఖాన్(25) అనే యవకుడు.. కోవిడ్ 19 నుంచి రక్షణ కోసం మాస్కులు ధరించడాన్ని ఎగతాళి చేస్తూ వీడియోలు చేసి టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. కొద్ది రోజులకి ఇతనిలో కరోనా లక్షనాలు కనిపించాయి. దీంతో అతనికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. తన సోదరి ఇంటికి వెళ్లిన తరువాత ఈ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే అధికారులు అతన్ని బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అలాగే అతనితో పాటు కుటుంబసభ్యులను, ఇరుగుపొరుగు వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. కరోనా సోకి ఐసోలేషన్‌ వార్డులో చేరిన తర్వాత కూడా ఇతను టిక్‌టాక్‌లు చేయడంతో అధికారులు అతడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక.. తను త్వరగా కోలుకోవాలని.. వీడియో పోస్ట్ చేస్తూ.. తన ఫాలోవర్లను కోరాడు. ఈ వీడియో చూసిన పలువురు అతడిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!