AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 18 నుంచి లాక్‌డౌన్‌-4..!? ..రాష్ట్రాలకు మే 15 టార్గెట్… ప్రధాని మోదీ ఆదేశం

లాక్‌డౌన్ పొడిగిస్తూ... ఎవరికీ ఇబ్బంది కలగకుండా... వీలైనన్ని ఎక్కువ సడలింపులు ఇవ్వాలనే ఆలోచనకు కేంద్రం వచ్చినట్లు కనిపిస్తోంది...

ఈ నెల 18 నుంచి లాక్‌డౌన్‌-4..!? ..రాష్ట్రాలకు మే 15 టార్గెట్... ప్రధాని మోదీ ఆదేశం
Jyothi Gadda
|

Updated on: May 12, 2020 | 12:35 PM

Share

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా..? మిన‌హాయింపులు  ఇస్తారా…అనే దానిపై ఈ నెల 15నాటికి స్ప‌ష్ట‌త రానుంది. అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ నిన్న నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై ఈ నెల 15నాటికి బ్లూ ప్రింట్ ఇవ్వాల‌ని సీఎంల‌కు సూచించారు. ఒక వేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే.. ఆ త‌ర్వాత వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాలో కూడా పంపాల‌ని సీఎంల‌ను మోదీ కోరారు…

వరుస లాక్‌డౌన్‌ల నేప‌థ్యంలో సోమవారం ఐదోసారి ప్రధాని మోడి ముఖ్యమంత్రుల‌తో  ఇలాంటి సమావేశం నిర్వహించారు. ఈ సారి ఆయన లాక్‌డౌన్‌ పొడిగింపు, లేదా సడలింపులకంటే కూడా ఆర్ధిక వ్యవస్థ పున:ప్రారంభంపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రుల అభిప్రాయాల్ని స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ మహమ్మారి పరిణామాలు, భారత్‌లో కేసుల సంఖ్య, రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులపై ప్రతి ఒక్క ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని ఆయన తీసుకున్నారు. అంతకుముందు దేశంలో వైరస్‌ తీరుతో పాటు అది దిశను మార్చుకుంటున్న వైనాన్ని కూడా ప్రధాని వివరించారు.

మూడో విడత లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని నిబంధనల్ని అమలు చేస్తూనే సాధారణ జనజీవనం వైపు దేశాన్ని నడిపించాల్సిన అవసరాన్ని ప్రతి ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. మే 17తర్వాత కొన్ని సడలింపులకు కేంద్రం కూడా సంసిద్దత వ్యక్తంచేసింది. వాస్తవానికి నిబంధనలు కొనసాగుతాయి. పేరుకు లాక్‌డౌన్‌ ఉంటుంది. అయితే ఇప్పుడున్నన్ని షరతులు, దిగ్భందనాలుండవు. సాంకేతికంగా లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ మినహాయింపుల దృష్ట్యా సాధారణ జనజీవనం కొనసాగుతుంది. కేవలం రెడ్‌జోన్‌లు, కంటైన్‌మెంట్‌ జోన్లలోనే నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్ 4 ఎలా ఉండాలనేది డిసైడ్ చెయ్యాల్సిన బాధ్యత రాష్ట్రాలపై పడింది. మే 15కల్లా రాష్ట్రాలు ఇచ్చే నివేదికలను కేంద్రం  అధ్య‌య‌నం చేస్తుంది. తద్వారా… మే 17న నెక్ట్స్ ఏం చెయ్యాలో చెబుతూ… కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకటన రిలీజ్ చేస్తుంది.

Follow Us