AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పు ఆఫ్రికాలో దుమ్మురేపుతున్న.. ‘క‌రోనా వైర‌స్ హెయిర్ స్ట‌యిల్‌’..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. కొంత‌మందికి ఈ ప్రాణాంత‌క వైర‌స్ హెయిర్ స్ట‌యిల్‌గా మారింది. తూర్పు ఆఫ్రికాలో ప్ర‌స్తుతం కరోనా వైరస్ కేశాలంకరణ

తూర్పు ఆఫ్రికాలో దుమ్మురేపుతున్న.. 'క‌రోనా వైర‌స్ హెయిర్ స్ట‌యిల్‌'..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 12, 2020 | 11:38 AM

Share

Corona virus hairstyle: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. కొంత‌మందికి ఈ ప్రాణాంత‌క వైర‌స్ హెయిర్ స్ట‌యిల్‌గా మారింది. తూర్పు ఆఫ్రికాలో ప్ర‌స్తుతం కరోనా వైరస్ కేశాలంకరణ ఎంతో ఆద‌ర‌ణ పొందుతోంది. ఇక్క‌డి ప్రజలు తమ జుట్టుతో కరోనా వైరస్ కొమ్ముల‌ను తయారు చేయించుకునేందుకు ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. కరోనా వైరస్ నివారణకు అన్ని దేశాలు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

కాగా.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రిక‌న్‌వాసులు ఇటువంటి కేశాలంకరణపై మొగ్గుచూప‌డం విచిత్రంగా మారింది. తాము క‌రోనా హెయిర్ స్ట‌యిల్ చేయించుకుని, ఈ వైర‌స్ ఎంత ప్ర‌మాద‌కారో తెలియ‌జేస్తున్నామ‌ని ప‌లువురు చెబుతున్నారు. ఆఫ్రిక‌న్ ప్ర‌జ‌లు కేశాలంక‌ర‌ణ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంటారు. అక్క‌డి సెలూన్ల‌లో ర‌క‌ర‌కాల కేశాలంక‌ర‌ణ ఫొటోలు క‌నిపిస్తుంటాయి.

Follow Us