AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెక్నలాజియా..! మాట్లాడే గొడుగు.. GPS డైరెక్షన్లు, నోటిఫికేషన్లు అన్నీ చెప్పేస్తుంది

టెక్నాలజీ ప్రపంచంలో మరో వినూత్న ఆవిష్కరణ సోషల్ మీడియాని ఊపేస్తోంది. అదే స్మార్ట్ స్క్రీన్ అంబ్రెల్లా (Smart Screen Umbrella). వర్షం నుండి రక్షించడమే కాకుండా, మనకు కావాల్సిన సమాచారాన్ని అరచేతిలో (లేదా తలపైన) చూపే ఈ గొడుగు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వర్షంలో నడుస్తున్నప్పుడు ఫోన్ పట్టుకుని మ్యాప్స్ చూడటం కష్టం. ఈ గొడుగు ఆ లోటును తీరుస్తుంది. స్క్రీన్ మీద మీకు వెళ్లాల్సిన దారిని చూపిస్తుంది.

టెక్నలాజియా..! మాట్లాడే గొడుగు.. GPS డైరెక్షన్లు, నోటిఫికేషన్లు అన్నీ చెప్పేస్తుంది
Smart Screen UmbrellaImage Credit source: instagram
Jyothi Gadda
|

Updated on: Apr 25, 2026 | 1:50 PM

Share

సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే, మనం రోజువారీ వాడే అతి సాధారణ వస్తువులు కూడా ఇప్పుడు స్మార్ట్ గా మారిపోతున్నాయి. ఆ వరుసలోకే ఇప్పుడు ఈ అద్భుతమైన స్మార్ట్ గొడుగు వచ్చి చేరింది. దీని ఫీచర్లు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ స్మార్ట్ గొడుగు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా గొడుగును వర్షం లేదా ఎండ నుండి రక్షణ కోసం వాడుతాం. ఈ గొడుగు కేవలం తడవకుండా చూడటమే కాదు, మీకు ఒక వ్యక్తిగత సహాయకుడిలా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ గొడుగు ఒక మినీ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. దీని లోపల అమర్చిన హై-టెక్ స్క్రీన్ వల్ల మీరు ఫోన్ తీయకుండానే అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ గొడుగు లోపలి భాగంలో ఒక డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యి, ఫోన్ నోటిఫికేషన్లను స్క్రీన్ మీద చూపిస్తుంది. గొడుగు లోపలి భాగంలో ఉండే స్క్రీన్ మీద మీ ఫోన్ కు వచ్చే మెసేజ్‌లు, కాల్స్, నోటిఫికేషన్లు ప్రత్యక్షమవుతాయి. వర్షంలో నడుస్తున్నప్పుడు ఫోన్ పట్టుకుని మ్యాప్స్ చూడటం కష్టం. ఈ గొడుగు ఆ లోటును తీరుస్తుంది. స్క్రీన్ మీద మీకు వెళ్లాల్సిన దారిని చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ గొడుగు మీతో మాట్లాడుతుంది. వాతావరణం ఎలా ఉంది? రాబోయే గంటలో వర్షం పడుతుందా? వంటి వివరాలను వాయిస్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. వెదర్ అప్డ్‌డేట్స్‌ ఇస్తుది. గాలి వేగం, ఉష్ణోగ్రత, వర్షం పడే సూచనలను ఇది ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ గొడుగుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో ఇంటర్నెట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఇక వర్షంలో కూడా ఫోన్ లోనే మునిగిపోవాలా? అని కొందరు విమర్శిస్తుంటే, GPS ఫీచర్ ప్రయాణికులకు చాలా ఉపయోగకరం అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా అపరిచిత నగరాల్లో వర్షం పడుతున్నప్పుడు దారి వెతుక్కోవడానికి ఇది గొప్ప ఆవిష్కరణ అని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, ఇలాంటి వింత ఆవిష్కరణలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో మనం రోడ్ల మీద ఇలాంటి డిజిటల్ గొడుగులను పట్టుకుని నడిచే రోజులు ఎంతో దూరంలో లేవు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సైనా నెహ్వాల్ ’ఫైటర్ మామ్‘ వీడియో వైరల్
సైనా నెహ్వాల్ ’ఫైటర్ మామ్‘ వీడియో వైరల్
రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపులు..!
రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపులు..!
దీంతో చేసిన బిర్యానీలు, చాక్లెట్లు హెల్తీ.. సీక్రెట్స్ ఇవే
దీంతో చేసిన బిర్యానీలు, చాక్లెట్లు హెల్తీ.. సీక్రెట్స్ ఇవే
సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది..
సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది..
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..