జ‌న‌వ‌రి 30న భార‌త్‌లో తొలి క‌రోనా కేసు..ఆ త‌ర్వాత ఇలా…

జ‌న‌వ‌రి 30న భార‌త్‌లో తొలి క‌రోనా కేసు..ఆ త‌ర్వాత ఇలా...

ఈ ఏడాది చివ‌ర్లో భార‌త్‌లో ప్ర‌వేశించిన కోవిడ్‌-19 వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. దేశంలో తొలి క‌రోనా కేసు జ‌న‌వ‌రి 30న న‌మోదు కాగా..10 వేల కేసుల‌ను చేర‌డానికి 74 రోజులు ప‌ట్టింది. ఆ త‌ర్వాత...

Jyothi Gadda

|

May 12, 2020 | 7:52 AM

ప్ర‌పంచ దేశాల‌ను హ‌డ‌లెత్తించిన క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌లో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. చాప‌కింద నీరులా విస్త‌రిస్తూ…దేశ‌వ్యాప్తంగా క‌రోనా ర‌క్క‌సి పంజా విసురుతోంది. ఈ ఏడాది చివ‌ర్లో భార‌త్‌లో ప్ర‌వేశించిన కోవిడ్‌-19 వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. దేశంలో తొలి క‌రోనా కేసు జ‌న‌వ‌రి 30న న‌మోదు కాగా..10 వేల కేసుల‌ను చేర‌డానికి 74 రోజులు ప‌ట్టింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ మంది బాధితులు వైర‌స్ బారిన ప‌డుతూ వ‌చ్చారు. అలా మొద‌లైన వైర‌స్ వ్యాప్తి …10 వేల నుంచి 20 వేల‌కు 9 రోజుల స‌మ‌యం ప‌ట్ట‌గా.. 20 వేల నుంచి 30 వేల‌ను చేర‌డానికి 8 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. 30 వేల నుంచి 40 వేల‌కు 6 రోజులు, 40 వేల నుంచి 50 వేల‌కు 4 రోజులు, 50 వేల నుంచి 60 వేల‌కు నాలుగు రోజులు, 60 వేల నుంచి 70 వేల‌ను చేర‌డానికి 3 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. అంటే దీనిని బ‌ట్టే తెలుస్తోంది..భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ఎంత వేగంగా విస్త‌రిస్తోందో…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu