హోం ఐసొలేషన్‌‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ..

హోం ఐసొలేషన్‌‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ..

హోం ఐసొలేషన్ అయ్యేవాళ్లు ఎన్ని రోజులు అలా ఉండాలి అనే అంశంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ పాజిటివ్ అని తేలినప్పటి నుంచి 17 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేషన్ కావాల్సి ఉంటుందని వివరించింది. ఇలా ఉండేవారికి జనరల్‌గా ఓ వారం రోజుల్లో కరోనా లక్షణాలు తగ్గిపోతాయి. అందువల్ల వారం తర్వాత వారికి టెస్ట్ చేస్తారు. వారం తర్వాత నుంచి చివరి 10 రోజులూ… కరోనా లక్షణాలు లేకపోతే… అప్పుడు 18వ రోజున ఐసొలేషన్ […]

Jyothi Gadda

|

May 12, 2020 | 7:15 AM

హోం ఐసొలేషన్ అయ్యేవాళ్లు ఎన్ని రోజులు అలా ఉండాలి అనే అంశంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ పాజిటివ్ అని తేలినప్పటి నుంచి 17 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేషన్ కావాల్సి ఉంటుందని వివరించింది. ఇలా ఉండేవారికి జనరల్‌గా ఓ వారం రోజుల్లో కరోనా లక్షణాలు తగ్గిపోతాయి. అందువల్ల వారం తర్వాత వారికి టెస్ట్ చేస్తారు. వారం తర్వాత నుంచి చివరి 10 రోజులూ… కరోనా లక్షణాలు లేకపోతే… అప్పుడు 18వ రోజున ఐసొలేషన్ నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా… వారం తర్వాత కూడా కరోనా లక్షణాలు కనిపిస్తే… అప్పుడు హోం ఐసొలేషన్ కాలాన్ని పొడిగిస్తారు. ప్రస్తుతం 28 రోజులు అమల్లో ఉంది కాబట్టి… వారంలో నయం కాని వారికి 28 రోజులు అమలు చేసే అవకాశం ఉంటుంది.

ప్ర‌స్తుతం పాటిస్తున్న హోం ఐసోలేష‌న్‌కు కేంద్రం సూచించిన కొత్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం 17 రోజుల తర్వాత టెస్టులేవీ ఉండవు. ఆటోమేటిక్‌గా ఐసొలేషన్ ముగిసినట్లవుతుంది.  కొత్త రూల్స్ ప్రకారం… వ్యాధి లక్షణాలు ఉండేవారికి మాత్రమే ఐసొలేషన్ పూర్తైన తర్వాత RT-PCR టెస్ట్ చేస్తారు. ఆస్పత్రుల్లోని ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండేవారికి గడువు పూర్తయ్యాక… లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా టెస్ట్ చేస్తారు. టెస్టుల్లో పాజిటివ్ వస్తే… మళ్లీ లక్షణాలు పోయేవరకూ ఐసొలేషన్‌లోనే ఉంచుతారు.  వైర‌స్ లక్షణాలు లేని వారికి, తీవ్రత తక్కువ ఉన్న వారికి డిశ్చార్జి సమయంలో పరీక్షలు నిర్వహించరు. డిశ్చార్జి అవుతున్న వారి వల్ల కరోనా సోకుతున్నట్లు కేసులేవీ రావట్లేదన్న కేంద్రం… అందుకే డిశ్చార్జి సమయంలో టెస్టులు చేయాల్సిన అవసరం లేదని చెబుతోంది. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu