కోవాగ్జిన్ రెండో దశ హ్యూమన్ ట్రయల్స్ షురూ..

కోవాగ్జిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్‌లో ఫేజ్‌–2 వ్యాక్సిన్ ప్రయోగం మొదలైంది. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఫేజ్‌–2 ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు.

కోవాగ్జిన్ రెండో దశ హ్యూమన్ ట్రయల్స్ షురూ..
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 10:43 AM

కోవాగ్జిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్‌లో ఫేజ్‌–2 వ్యాక్సిన్ ప్రయోగం మొదలైంది. కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్‌ బయోటెక్‌ ఫార్మాసూటికల్‌ సంస్థ ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసింది.

కోవాగ్జిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా మొదటి దశ సక్సెస్ అయ్యింది. కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్న 12 ఆస్పత్రుల్లో నిమ్స్ ఒకటి. ఆయా ఆస్పత్రిలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫేజ్‌–1ను విజయవంతం చేశాయి. టీకా తీసుకున్న వలంటీర్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఫేజ్‌–2 ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఫేజ్‌–2 టీకాలు వేయడం ఆరంభించారు. నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ కె.మనోహర్‌ పర్యవేక్షణలో నోడల్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. వీళ్లందరిని నాలుగు గంటల అబ్జర్వేషన్‌ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

అదే విధంగా బుధవారం మరో 15 మందికి టీకా ప్రయోగం చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు ఈ కొనసాగించేందుకు సన్నాహాలు చేపట్టినట్టు సమాచారం. కాగా ఈ టీకా ప్రయోగం ప్రక్రియలో భాగంగా ఆదివారం దాదాపుగా 80 మంది వాలంటీర్లకు స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించారు.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..