AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఈ వైరస్ లేనట్టే’! ఇటలీ డాక్టర్ ! ‘సంబరపడొద్దు’…ప్రపంచ ఆరోగ్య సంస్థ

కొత్త కరోనా వైరస్ దేశంలో(ఇటలీలో) లేనట్టేనంటూ అక్కడి  ఓ ప్రముఖ డాక్టర్ చేసిన ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. మూడు నెలల క్రితం దేశంలో విధించిన లాక్ డౌన్ ని...

'ఈ వైరస్ లేనట్టే'! ఇటలీ డాక్టర్ ! 'సంబరపడొద్దు'...ప్రపంచ ఆరోగ్య సంస్థ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 12:03 PM

Share

కొత్త కరోనా వైరస్ దేశంలో(ఇటలీలో) లేనట్టేనంటూ అక్కడి  ఓ ప్రముఖ డాక్టర్ చేసిన ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. మూడు నెలల క్రితం దేశంలో విధించిన లాక్ డౌన్ ని మెల్లగా సడలించడానికి ఇటాలియన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సమయంలో.. అల్బర్టో జాంగ్రీల్లో అనే పేరు మోసిన డాక్టర్ ఒకరు ఈ సరికొత్త ప్రకటన చేశాడు. నిజం చెప్పాలంటే.. ఈ కరోనా వైరస్ దేశంలో మటుమాయమైందని ‘చల్లని కబురు’ చెప్పాడు. మిలన్ లోని ఓ పెద్ద ఆసుపత్రిలో ఈయన సీనియర్ వైద్యుడట. గత 10 రోజుల్లో నిర్వహించిన టెస్టులను, రెండు నెలల క్రితం చేసిన టెస్టులను పోల్చి చూసినప్పుడు.. తాజాగా నిర్వహించిన టెస్టులో కనబడిన వైరస్ బలహీనంగా కనిపించిందని ఆయన పేర్కొన్నాడు. అంటే దీని అర్థం కరోనా వైరస్ లేనట్టే కదా అన్నాడాయన. కానీ అనేకమంది ఇతర డాక్టర్లు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఈ మహమ్మారి ఇంకా ఇంత బీభత్సం సృష్టిస్తుంటే వైరస్ లేదంటారేమిటంటూ వాళ్లంతా ‘గయ్యిమన్నారు’. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. ఇప్పుడే సంబర పడవద్దని, ఇది ఇప్పటికీ ‘కిల్లర్ వైరసే’ నని షాకింగ్ సమాచారమిచ్చింది. దీనిపట్ల మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి 33 వేల మంది రోగులు మరణించారు.

Follow Us
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!
కోపం వచ్చినప్పుడు ఈ ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ జీవితమే మారుతుంది
కోపం వచ్చినప్పుడు ఈ ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ జీవితమే మారుతుంది
NEET PG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి
NEET PG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి
షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయా? వెంటనే ఈ పని చేయండి..
షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయా? వెంటనే ఈ పని చేయండి..
రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే
రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే