ఐపీఎల్ ఉంటుంది…! రెడీగా ఉండండి-గంగూలీ

ఐపీఎల్ 13వ సీజన్‌పై కీలక ప్రకటన చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ ఏడాది మెగా టోర్నీని నిర్వహించి తీరుతామని తెలిపారు...

  • Sanjay Kasula
  • Publish Date - 2:13 pm, Thu, 11 June 20
ఐపీఎల్ ఉంటుంది...! రెడీగా ఉండండి-గంగూలీ

ఐపీఎల్ 13వ సీజన్‌పై కీలక ప్రకటన చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ ఏడాది మెగా టోర్నీని నిర్వహించి తీరుతామని తెలిపారు. ఇందుకు కావల్సిన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరమైతే ఖాళీ స్టేడియాలో నైనా నిర్వహించేందకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు. ఐసీసీ బోర్డు సమావేశం తర్వాత ఈ అంశంపై (జూన్ 11)బుధవారం రాత్రి అన్ని సంఘాలకు గంగూలీ లేఖ రాశారు. కోవిడ్‌-19 వల్ల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఐపీఎల్‌ను నిర్వహించే ఆసక్తితో గంగూలీ ఉన్నట్లు ఆ లేఖ ద్వారా తెలుస్తోంది. అభిమానులు, ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, స్టేక్‌ హోల్డర్లతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు.. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని.. మేం కూడా ఈ టోర్నీపై ఆశగా ఉన్నామని, భవిష్యత్తు కార్యాచరణనను త్వరలోనే  ప్రకటిస్తామని గంగూలీ తెలిపారు.