జూన్ 3న తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు...

జూన్ 3న తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 7:50 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరు కాకపోతే మరోసారి ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుందన్నారు. కాగా జులై 3వ వారంలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్‌గానే పరిగణిస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా.. పాత పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు ఉంటాయన్నారు. కాగా విద్యార్థులు పాత హాల్ టికెట్లతోనే హాజరు కావచ్చునని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్