India Corona Cases Update: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో వచ్చిన కేసులు ఎన్నంటే..

Corona Cases India: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,921 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ

India Corona Cases Update: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో వచ్చిన కేసులు ఎన్నంటే..
Coronavirus
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2021 | 12:47 PM

Corona Cases India: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,921 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,62,707కి చేరింది. నిన్న కొత్తగా 20,672 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,09,20,046 మంది కోలుకున్నారు.

కాగా, బుధవారం ఒక్కరోజే 133 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,58,063కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,84,598 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్ర, కేరళరాష్ట్రాల్లో మునపటి కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 9,9271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 2,316 కొత్త కేసులు బయటపడ్డాయి. దీనితో ఈ రెండు రాష్ట్రాలలోని ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read:

Telangana corona Updates: తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి..

Telangana Million March: ఆ అపురూప ఘట్టానికి సరిగ్గా పదేళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జైతెలంగాణ’ ఆవాజ్‌