COVID-19 vaccine: కరోనా టీకా తీసుకున్న సౌత్ స్టార్ హీరో మోహన్‌లాల్.. వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు
Mohanlal receives Corona vaccine: దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ముందుగా వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ..
Mohanlal receives Corona vaccine: దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ముందుగా వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో అర్హత కలిగిన సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు పలువురు ప్రముఖులు సైతం వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సౌత్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బుధవారం కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఆసుపత్రికలో మోహన్ లాల్ వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్ చేసి వెల్లడించారు.
కొచ్చి నగరంలోని అమృతా ఆసుపత్రిలో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నానని మోహన్‌లాల్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, తయారు చేస్తున్న, ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి హర్ష వర్థన్, రాష్ట్రమంత్రి శైలజ టీచర్‌కు ట్విట్‌ను ట్యాగ్ చేశారు.
Took the First Shot of Covid Vaccine from Amrita Hospital. I thank GOI ,companies which are producing the Vaccine & the Medical fraternity, including hospitals, for the assistance in d Vaccination Drive.@narendramodi @drharshvardhan @vijayanpinarayi #Shylajateacher @ICMRDELHI pic.twitter.com/bmkciwiTDQ
— Mohanlal (@Mohanlal) March 10, 2021
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనావ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య బుధవారం ఉదయం నాటికి 2,43,67,906 చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 13.5 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది.
Also Read: