దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన పీఎంవో..!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే తొమ్మిదివేలకు పైగా ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్.. తాజాగా మనదేశంలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా పంజాబ్‌లో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దేశంలో కరోనా డెత్ ట్రోల్ నాలుగుకు చేరుకుంది. అయితే ఈ క్రమంలో గురువారం సాయంత్రం 8.00 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అయితే గురువారం సాయంత్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే తొమ్మిదివేలకు పైగా ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్.. తాజాగా మనదేశంలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా పంజాబ్‌లో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దేశంలో కరోనా డెత్ ట్రోల్ నాలుగుకు చేరుకుంది. అయితే ఈ క్రమంలో గురువారం సాయంత్రం 8.00 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అయితే గురువారం సాయంత్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో ప్రజలు అనవసరమైన భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో పీఎంవో స్పందించింది.
సోషల్ మీడియాలో వస్తున్న లాక్‌డౌన్ వార్తలను ప్రభుత్వ సన్నిహిత వర్గాలు కొట్టి పారేశాయి. కరోనా విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీరోజు సమీక్షిస్తున్నారని.. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. అధికారులంతా ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేకాదు.. కోవిడ్-19పై 24 గంటలు పనిచేసేలా ఒక ప్రత్యేక కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
అయితే గురువారం సాయంత్రం 8.00 గంటలకు ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు..? కరోనా వైరస్‌ను అడ్డుకనేందుక ఎలాంటి చర్యలు తీసుకోబుతున్నారన్న దానిపై ఉత‍్కంఠ నెలకొంది.