Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మహారాష్ట్రాలో ఒమిక్రాన్‌ కలకలం..? సౌతాఫ్రిక నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌..

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌గా రూపుమార్చుకున్న ఈ మాయదారి రోగం మరోసారి ప్రపంచంపై దండెత్తడానికి వస్తోంది....

Coronavirus: మహారాష్ట్రాలో ఒమిక్రాన్‌ కలకలం..? సౌతాఫ్రిక నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌..
Corona Positive In Maharash
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 29, 2021 | 5:55 AM

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌గా రూపుమార్చుకున్న ఈ మాయదారి రోగం మరోసారి ప్రపంచంపై దండెత్తడానికి వస్తోంది. తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్‌ ప్రపంచానికి పాకేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రాలోని థానే జిల్లాకు చెందిన డోంబివ్లిలో కరోనా కలకలం సృష్టించింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కోవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా గందరోళ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఒమిక్రాన్‌ వేరియంట్‌ అనడానికి మాత్రం ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. పరీక్షల నిమిత్తం అధికారులు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి, సదరు వ్యక్తికి క్వారంటైన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ ముప్పు సంక్షోభంగా మారకముందే ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు, అంతర్జాతీయ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో ఇజ్రాయెల్‌ ముందు వరుసలో ఉంది. సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఐరాపా ఖండంలోని కొన్న దేశాలతో పాటు, ఆస్ట్రేలియా కూడా ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.

ఇక ఒమిక్రాన్‌ను నిరోధించే క్రమంలో భారత ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియంత్రణ, నిఘా పెంచాలని సూచించారు. అలాగే టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Also Read: Smart Phones: ఈ వారం ఇండియాలో విడుదలయ్యే ఫోన్‌లు, వాటి ధర.. ఫీచర్స్‌ తెలుసుకోండి..

Suriya: చిరంజీవితో పోటీ పడుతున్న హీరో సూర్య !! వీడియో

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి