డైరెక్టర్ రాజమౌళి కుటుంబానికి ‘కరోనా’ ఎలా సోకిందంటే?
టాలీవుడ్ ప్రముఖ దర్మకధీరుడు రాజమౌళికి, అతని కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ న్యూస్ టాలీవుడ్‌లో కలకలం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఇక వీరి ఫ్యామిలీకి కరోనా ఎలా సోకిందంటే..
టాలీవుడ్ ప్రముఖ దర్మకధీరుడు రాజమౌళికి, అతని కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ న్యూస్ టాలీవుడ్‌లో కలకలం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఇక వీరి ఫ్యామిలీకి కరోనా ఎలా సోకిందంటే.. డైరెక్టర్ రాజమౌళిది మొదటి నుంచీ ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో వివిధ ఫ్లాట్స్‌లో నివసిస్తూంటారు. ఇక షూటింగ్స్ సమయాల్లో ఉదయం, సాయంత్రం కలుసుకోవడం, వారాంతాల్లో గెట్‌టూగెదర్‌లా అందరూ కలిసే ఉంటారు. రాజమౌళి ఫ్యామిలీతో పాటు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి ఫ్యామిలీ ఆయన తండ్రి శివశక్తి దత్తా ఇలా అందరూ ఒకే చోట కలిసి అన్యోన్యంగా ఉంటారు.
కాగా రాజమౌళి గత రెండేళ్ల క్రితం సూర్యపేట జిల్లా వద్ద దాదాపు 100 ఎకరాల ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేశారు. వీరికి ఏమాత్రం విరామం దొరికినా కుటుంబాలతో కలిసి అందరూ ఆ ఫామ్ హౌస్‌కు వెళ్తూంటారు. తాజాగా లాక్‌డౌన్ సమయంలో కూడా వీరందరూ కలిసి అక్కడకు వెళ్లారట. అక్కడే కొంతకాలం ఉన్న తర్వాత ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారని తెలిసింది.
ఇక వీరు వచ్చీ రాగానే కుటుంబంలో అందరికీ జ్వరం రావడంతో టెస్ట్ చేసుకోగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే పెద్దగా లక్షణాలు లేకపోవడంతో.. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. రాజమౌళి ఫామ్ హౌజ్‌లో ఉన్న ఎవరికో ఒకరికి కరోనా సోకిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read More:
‘దావూద్ ఇబ్రహీం’ బయోపిక్‌ను తీయనున్న యాత్ర డైరెక్టర్..
ఆగష్టు 1 నుంచి మారే న్యూ రూల్స్ ఇవే..
‘సచిన్ కూతురు సారా’, ‘క్రికెటర్ శుభ్ మాన్ గిల్’ మధ్య ఏం జరుగుతోంది?
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కి షాక్.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..