కరోనా కేసులు నమోదు కానీ దేశాలు ఇవే..

కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యతో ఆయా దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు అక్కడ అత్యధిక కేసులు(1,602,132), మరణాలు(95,332) సంభవించాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి మొదలయ్యి ఇన్ని రోజులైనా కొన్ని […]

కరోనా కేసులు నమోదు కానీ దేశాలు ఇవే..
World Coronavirus
Follow us

|

Updated on: May 21, 2020 | 11:43 PM

కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యతో ఆయా దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు అక్కడ అత్యధిక కేసులు(1,602,132), మరణాలు(95,332) సంభవించాయి.

ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి మొదలయ్యి ఇన్ని రోజులైనా కొన్ని దేశాల్లో మాత్రం దాని ఊసేలేదు. కిరిబాటి, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, ఉత్తర కొరియా, పలావు, సమోవ, సోలమన్ దీవులు, టోన్గా, తుర్క్‌మొనిస్తాన్, తువాలు, వనౌటులలో ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 51 లక్షలు దాటగా..331,525 మరణాలు సంభవించాయి.

Read This: గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది కరోనాను జయించారు..