AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా.. మా మందు ఉత్పత్తికి సాయం చేస్తాం.. గిలీడ్ సైన్సెస్

కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగపడే రెమ్ డెసివిర్ మందును ఉత్పత్తి చేసేందుకు భారత, పాకిస్తాన్ దేశాలకు తాము సాయపడతామని దీని తయారీ కంపెనీ గిలీడ్ సైన్సెస్ ప్రకటించింది. యూరప్, ఆసియా దేశాలతో బాటు అభివృధ్ది చెందుతున్న దేశాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. మరో రెండేళ్ల కల్లా ఈ దేశాల్లో ఈ మెడిసిన్ ఉత్పత్తి అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాధితో సతమతమవుతున్న అనేక దేశాలు రోగుల చికిత్సలో రెమ్ డెసివిర్ మందునే వాడుతున్నాయి. ఈ […]

కరోనా.. మా మందు ఉత్పత్తికి సాయం చేస్తాం.. గిలీడ్ సైన్సెస్
Umakanth Rao
| Edited By: |

Updated on: May 06, 2020 | 5:20 PM

Share

కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగపడే రెమ్ డెసివిర్ మందును ఉత్పత్తి చేసేందుకు భారత, పాకిస్తాన్ దేశాలకు తాము సాయపడతామని దీని తయారీ కంపెనీ గిలీడ్ సైన్సెస్ ప్రకటించింది. యూరప్, ఆసియా దేశాలతో బాటు అభివృధ్ది చెందుతున్న దేశాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. మరో రెండేళ్ల కల్లా ఈ దేశాల్లో ఈ మెడిసిన్ ఉత్పత్తి అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాధితో సతమతమవుతున్న అనేక దేశాలు రోగుల చికిత్సలో రెమ్ డెసివిర్ మందునే వాడుతున్నాయి. ఈ వ్యాధి చికిత్స కోసం ఇప్పటికి వ్యాక్సీన్ ఏదీ ఇంకా లేకపోవడంతో.. అన్ని దేశాలూ ఈ మెడిసిన్ పైనే ఆధారపడ్డాయి. కోవిడ్-19 పేషంట్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని చూపే డేటాను ఈ సంస్థ నిరూపించి వివరించడంతో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ఆమోదం తెలిపింది. ఇండియా, పాకిస్తాన్ దేశాల్లోని పలు జెనెరిక్ మందుల తయారీ కంపెనీలతో తాము లైసెన్సుల విషయమై చర్చించామని గిలీడ్ సైన్సెస్ తెలిపింది. బంగ్లాదేశ్ లోని ఓ కంపెనీ ఈ నెల నుంచే ఈ మందు ఉత్పత్తికి శ్రీకారం చుట్టనుంది.

Follow Us