AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ‘ఆ టీంకు అంత సీన్ లేదు.. టాప్ 4 కాదుగా, 6లోనూ చేరదు..’

Ravichandran Ashwin Prediction: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు కీలక చర్చకు దారి తీశాయి. ఈసారి ఆ జట్టు టాప్ 4లో కాదుగా టాప్ 6లో కూడా ఉండదంటూ బాంబ్ పేల్చాడు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

IPL 2026: 'ఆ టీంకు అంత సీన్ లేదు.. టాప్ 4 కాదుగా, 6లోనూ చేరదు..'
Ravichandran Ashwin
Venkata Chari
|

Updated on: Mar 23, 2026 | 1:45 PM

Share

IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్ని జట్లు తమ స్క్వాడ్ ను సిద్ధం చేసుకుని ట్రోఫీ కోసం పోటీపడేందుకు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవగా ఈసారి కూడా గట్టి పోటీ ఉండనుంది. ఈ సమయంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

లక్నో జట్టుపై నెగటివ్ జోస్యం..

రవిచంద్రన్ అశ్విన్ ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి ప్లే ఆఫ్స్ కు కూడా అర్హత సాధించదని చెప్పారు. టాప్ 4లో కాకుండా టాప్ 6లో కూడా ఉండే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అభిమానులను షాక్ కు గురి చేశాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా షేర్ అవుతోంది.

రిషభ్ పంత్ పై కొత్త వ్యూహం..

లక్నో జట్టు ఈ సీజన్ కోసం తమ వ్యూహాల్లో మార్పులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలని నిర్ణయించింది. ఇటీవల పంత్ ఫామ్ లో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని కెరీర్ కు కూడా ఈ సీజన్ కీలకంగా మారింది.

ప్లేయింగ్ ఎలెవన్ లో పోటీ తీవ్రం..

అశ్విన్ మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాడు. లక్నో జట్టులో ఇప్పటికే అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారని చెప్పాడు. మయాంక్ యాదవ్ మొహ్సిన్ ఖాన్ ఆవేశ్ ఖాన్ మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు ఉండటంతో కొత్తవారికి అవకాశం దక్కడం కష్టమని అన్నాడు. గాయాలు వస్తే మాత్రమే మార్పులు జరిగే అవకాశం ఉందని వివరించాడు.

టాప్ జట్లపై ముందస్తు అంచనా..

అశ్విన్ ప్రకారం ఈ సీజన్ లో టాప్ 3 జట్లు ముందే నిర్ణయమై ఉన్నట్లు కనిపిస్తుందని చెప్పాడు. నాలుగో స్థానానికి మాత్రం గట్టి పోటీ ఉండనుందని అభిప్రాయపడ్డాడు. కానీ లక్నో జట్టు మాత్రం టాప్ 6లో కూడా స్థానం సంపాదించలేదని ధైర్యంగా చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us