కరోనా విజృంభణతో వణుకుతున్న దేశ రాజధాని ఢిల్లీ…ప్రతి గంటకు ఐదుగురు కరోనా రోగులు ప్రాణాలు

కరోనా విజృంభణకు దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. నిత్యం 6వేలకుపైగా కేసులు, 100కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 511 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఢిల్లీలోనే 121 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. నిత్యం వందకు పైగా మరణాలు సంభవించడం ఢిల్లీ మహానగరంలో ఇది ఐదోసారి. ఇలా, ప్రతి గంటకు ఐదుగురు కరోనా రోగుల ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా మృతుల సంఖ్య 8391కు చేరింది. అంతేకాకుండా నిత్యం నమోదవుతున్న […]

కరోనా విజృంభణతో వణుకుతున్న దేశ రాజధాని ఢిల్లీ...ప్రతి గంటకు ఐదుగురు కరోనా రోగులు ప్రాణాలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 24, 2020 | 12:18 AM

కరోనా విజృంభణకు దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. నిత్యం 6వేలకుపైగా కేసులు, 100కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 511 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఢిల్లీలోనే 121 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు.

నిత్యం వందకు పైగా మరణాలు సంభవించడం ఢిల్లీ మహానగరంలో ఇది ఐదోసారి. ఇలా, ప్రతి గంటకు ఐదుగురు కరోనా రోగుల ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా మృతుల సంఖ్య 8391కు చేరింది. అంతేకాకుండా నిత్యం నమోదవుతున్న కేసుల్లోనే ఢిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 6746 కరోనా కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,29,863కు చేరగా, పాజిటివిటీ రేటు 12.29శాతంగా ఉంది.

ఢిల్లీలో వైరస్‌ తీవ్రత పెరిగిన నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిత్యం 50వేల పరీక్షలు నిర్వహిస్తోంది. నిన్న 54,893 కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. వీటిలో 23వేల ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేపట్టినట్లు తెలిపింది. ఇదిలాఉంటే, దేశంలో గడిచిన 24 గంటల్లో మరో 44,059 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,33,738 మంది మృత్యువాతపడ్డారు.