ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

| Edited By:

Mar 29, 2020 | 1:46 PM

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీటిలో రెపోరేటును తగ్గించింది. అలాగే బ్యాంకు ఈఎంఐలు మూడు నెలల పాటు కట్టనక్కర్లేదని ఆర్బీఐ కీలక..

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు
Follow us on

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీటిలో రెపోరేటును తగ్గించింది. అలాగే బ్యాంకు ఈఎంఐలు మూడు నెలల పాటు కట్టనక్కర్లేదని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అన్ని రకాల బ్యాంకులు నెల వాయిదాలపై ఆర్బీఐ మారిటోరియం విధించింది. ఈ నిబంధనను అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. అంటే మారిటోరియం కాలంలో మీ వేతనం నుంచి ఈఎంఐ పేరిట నెలసరి వాయిదా కట్ కాదు.

బ్యాంకులు మీ అకౌంట్‌ నుంచి ఈఎంఐ డబ్బులను కట్ చేసుకోకపోతే దాని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని ఆర్బీఐ పేర్కొంది. అయితే కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు మాత్రం EMIలు కాట్టాల్సిందే అంటూ.. వినియోగదారులకు ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. ఈఎంఐలపై ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినప్పటికీ మాకు.. ఆదేశాలు అందలేదని.. కావున నెలసరి ఈఎంఐలకు సరిపడా డబ్బు అకౌంట్‌లో ఉంచాలని కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు మెసేజ్‌లు పంపిస్తున్నాయి.

దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నిరోజులు ఇంట్లో ఉంటే డబ్బులు ఎలా వస్తాయంటున్నారు. ఉద్యోగులకంటే ఆయా సంస్థలు.. కాస్త లేటు అయినా శాలరీలు ఇస్తాయి. కానీ రోజువారీ కూలీలు, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఈఎంఐల విషయంలో ఇబ్బందులు తప్పేలా కనబడటం లేదు. కాగా.. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులకు ఈ నిబంధనలు వర్తించవని.. ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. మరి ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి: లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

పాలపై టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా..

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..

మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

న్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..

కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు