AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కరోనా పేషంట్‌కు కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసిన హాస్పిటల్‌

ప్రైవేటు హాస్పిటల్స్‌ జలగల్లా పట్టి పీడిస్తాయని... లేని రోగాలకు కూడా లక్షలకు లక్షలు బిల్లులు వేసి రక్తం తోడేస్తారని అనుకుంటాం కానీ.. అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి

తెలంగాణ కరోనా పేషంట్‌కు కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసిన హాస్పిటల్‌
Balu
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jul 16, 2020 | 1:10 PM

Share

ప్రైవేటు హాస్పిటల్స్‌ జలగల్లా పట్టి పీడిస్తాయని… లేని రోగాలకు కూడా లక్షలకు లక్షలు బిల్లులు వేసి రక్తం తోడేస్తారని అనుకుంటాం కానీ.. అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి.. ఈ విషయంలో దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిని ఎంతగా మెచ్చుకున్నా తప్పులేదు.. అసలు జరిగిందేమిటంటే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన ఓడ్నాల రాజేశ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు.. అక్కడే కాయకష్టం చేసుకుంటున్నాడు.. 42 ఏళ్ల రాజేశ్‌ ఓ దుర్ముహూర్తాన కరోనా వైరస్‌ బారిన పడ్డాడు.. దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడు.. 80 రోజుల పాటు రాజేశ్‌కు చికిత్సను అందించిందా హాస్పిటల్‌.. మొత్తానికి రాజేశ్‌ చక్కగా కోలుకున్నాడు.. సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు.. కాకపోతే బిల్లు మాత్రం తడిసిమోపడయ్యింది.. సుమారు ఏడు లక్షల 62 వేల దిరమ్స్‌ బిల్లు వేసింది ఆసుపత్రి యాజమాన్యం.. మన కరెన్సీలో చెప్పాలంటే కోటిన్నర!

బిల్లు చూడగానే రాజేశ్‌కు గుండె గుబిల్లుమంది.. తన దీనగాధను గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ స్వామినారాయణ్‌.. దేవాలయ కమిటీ సభ్యుడు అశోక్‌ కొటేచా దృష్టికి తీసుకెళ్లాడు రాజేశ్‌.. వాళ్లు నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇండియన్‌ కాన్సలేట్‌ లేబర్‌ అధికారి హర్జీత్‌ సింగ్‌ను సంప్రదించారు.. రాజేశ్‌ స్థితిగతులను ఆయనకు వివరించారు.. రూపాయి కూడా కట్టలేని నిస్సాహయస్థితిలో ఉన్నాడని చెప్పారు. హర్జీత్ సింగ్‌ బిల్లు మాఫీ చేయాలంటూ ఆసుపత్రి యాజమాన్యానికి ఓ లేఖ రాశారు.. ఆసుపత్రి కూడా సహృదయతో బిల్లును మాఫీ చేసింది.. పైసా తీసుకోకుండా రాజేశ్‌ను డిశ్చార్జ్‌ చేసింది. అంతేనా… రాజేశ్‌తో పాటు అతడి సహాయకుడు కనకయ్యకు అశోక్‌ కొటేచా విమాన టికెట్లు కొనివ్వడమే కాకుండా చేతి ఖర్చుల కోసం పది వేల రూపాయలు ఇచ్చి భారత్‌కు పంపాడు.. హైదరాబాద్‌కు వచ్చిన వారిద్దరిని హోం క్వారంటైన్‌కు అధికారులు అనుమతి ఇచ్చి సొంతూరికి పంపించారు..

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్