AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ తొలి కరోనా సెంట‌ర్‌లో జీరోకు చేరిన రోగుల సంఖ్య‌..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఈ నెలాఖ‌రు నాటికి 5.5 ల‌క్ష‌ల కరోనా బాధితులు ఉంటార‌ని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు రికవరీ రేటు

ఆ తొలి కరోనా సెంట‌ర్‌లో జీరోకు చేరిన రోగుల సంఖ్య‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 17, 2020 | 10:07 AM

Share

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఈ నెలాఖ‌రు నాటికి 5.5 ల‌క్ష‌ల కరోనా బాధితులు ఉంటార‌ని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు రికవరీ రేటు 80 శాతానికి మించి ఉంటోంది. మ‌రోవైపు రాజధానిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. జూన్ ఆరంభంలో ఢిల్లీలోని ఇండోర్ స్టేడియంల‌ను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చాలనే ప్రణాళికపై ప్రభుత్వం చర్చించింది. గత 25 రోజుల్లో ప‌లు హైటెక్ కోవిడ్ కేంద్రాలు ఢిల్లీలో ఏర్పాట‌య్యాయి.

వివరాల్లోకెళితే.. దేశ రాజధానిలో తొలుత షెహనాయ్ బ్యాంకెట్ హాల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చారు. 100 పడకల షెహ‌నాయ్ కోవిడ్ సెంటర్‌లో ఒకేసారి గరిష్టంగా 60 మంది రోగులు చేరారు. జూలై 15 నాటికి ఒక్క రోగి కూడా ఇక్కడ‌ లేరు. షెహనాయ్ బ్యాంకెట్‌ హాల్ కోవిడ్ కేర్ సెంటర్‌లో రోగుల సంఖ్య సున్నాగా మారిన సంద‌ర్భంగా ఎల్‌ఎన్‌జెపీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న రోగులలో కొంతమంది తూర్పు ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కోవిడ్ కేర్ సెంటర్‌కు త‌ర‌లివెళ్లార‌న్నారు. వారిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌లిగిన‌ కరోనా రోగులు, చికిత్స పూర్త‌యిన‌వారు క‌రోనా నెగిటివ్ రిపోర్టు కోసం వేచిచేస్తున్నార‌న్నారు.

కాగా.. ఈ కోవిడ్ సెంట‌ర్‌ను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రితో అనుసంధానించార‌న్నారు. అవసరమైనప్పుడు ఇక్క‌డికి రోగులను త‌ర‌లిస్తామ‌ని తెలిపారు. ఢిల్లీలో గ‌త రెండు వారాలుగా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింద‌న్నారు. ఇంతకుముందు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి రోజూ 100 నుంచి 110 మంది క‌రోనా బాధితులు వచ్చేవార‌న్నారు.  ఇప్పుడు 50 నుంచి 60 మంది రోగులు మాత్రమే రోజూ వ‌స్తున్నార‌న్నారు. దీనికితోడు క‌రోనా మరణాల రేటు కూడా త‌గ్గింద‌న్నారు.

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌