AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తానన్న ట్రంప్… నాకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేశాయని అసంతృప్తి…

బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ కు 306 రాగా, ట్రంప్ కు 232 మాత్రమే వచ్చాయి

ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తానన్న ట్రంప్... నాకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేశాయని అసంతృప్తి...
Umakanth Rao
|

Updated on: Nov 27, 2020 | 7:06 PM

Share

బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ కు 306 రాగా, ట్రంప్ కు 232 మాత్రమే వచ్చాయి. అయిన ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. కాగా, ట్రంప్ నవంబర్ 27న అధ్యక్ష కార్యాలయ సిబ్బందికి ధ‌న్య‌వాద స‌మావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విష ప్రచారం జరిగిందని అన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తామని తెలిపారు. వచ్చే వారంలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు బైడెన్‌ సిద్ధమవుతున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 8 కోట్లపై చిలుకు ఓట్లతో గెలిచిన తొలి ప్రెసిడెన్షియల్‌ క్యాండిడేట్‌గా జోబైడెన్‌ చరిత్ర సృష్టించారు. కౌంటింగ్‌ కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా. ఇప్పటి వరకు బైడెన్‌కు 8కోట్ల 11వేల ఓట్లు రాగా, ట్రంప్‌నకు 7.38 కోట్ల ఓట్లు వచ్చాయి. కౌంటింగ్‌ ప్రక్రియ మరికొన్ని రోజల పాటు కొనసాగనుంది.

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?