ఢిల్లీలో కొవిడ్‌ విజృంభణ.. ఒక్కరోజే 22 వేల కరోనా కొత్త కేసులు.. 17 మంది మృతి..

|

Jan 09, 2022 | 8:59 PM

Delhi Corona: ఢిల్లీలో కరోనా వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోజు రోజుకి కేసులు ఎక్కువవుతున్నాయి. గత 24 గంటల్లో 22,751 కొత్త కరోనా

ఢిల్లీలో కొవిడ్‌ విజృంభణ.. ఒక్కరోజే 22 వేల కరోనా కొత్త కేసులు.. 17 మంది మృతి..
Corona Virus
Follow us on

Delhi Corona: ఢిల్లీలో కరోనా వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోజు రోజుకి కేసులు ఎక్కువవుతున్నాయి. గత 24 గంటల్లో 22,751 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజే 17 మంది చనిపోయారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల మధ్య 10 వేల 179 మంది రోగులు కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. ఢిల్లీలో కరోనా సంక్రమణ రేటు 23.53 శాతానికి పెరిగింది.

శనివారం 20181 కొత్త కేసులు నమోదయ్యాయి. నేడు ఈ కేసులు 22,751కి పెరిగాయి. ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం 7గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజులోనే మరణాల్లో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. నిన్నటి కంటే ఈ రోజు 10 మంది రోగులు ఎక్కువగా మరణించారు. ప్రస్తుతం రాజధానిలో 60,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 14,63,837 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు.

ఢిల్లీలోని ఆసుపత్రుల్లో 310 మంది కరోనా రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో 440 మంది రోగులు ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నారు. వీరిలో 44 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈ రోగులందరిలో, 442 మంది ఢిల్లీ నివాసితులు 176 మంది ఢిల్లీ బయటి నుంచి వచ్చారు. ఢిల్లీలో రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. పరిస్థితి చాలా ఘోరంగా మారింది. ఆసుపత్రులలో పెద్ద సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. శనివారం వరకు ఎయిమ్స్‌లో 200 మందికి పైగా వైద్యులు ఇన్‌ఫెక్షన్‌లో ఉన్నారు. బయటి నుంచి వైద్యులను పిలిపించే పరిస్థితి నెలకొంది.

HDFC బ్యాంక్‌ ఖాతాదారులు అలర్ట్‌..! మారిన కొత్త నియమాలు తెలుసుకోండి..?

Indigo Flight: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఇండిగో ఎయిర్‌లైన్స్ 20% విమానాలు రద్దు..

Bird Hit Plane: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఉలిక్కి పడ్డ ప్రయాణికులు.. ఫొటోలు చూస్తే షాక్‌..