ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి ప్లాస్మా థెరపీ

ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. గత నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:00 pm, Fri, 19 June 20
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి ప్లాస్మా థెరపీ

ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. గత నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. దీంతో కరోనా పరీక్షలు చేయగా.. ఆయనకు రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనకు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఉపిరితిత్తుల్లో ఇన్పెక్షన్‌ పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్ అందించామన్నారు. కాగా, ఆయనకు ప్లాస్మా థెరపీ చేసేందుకు వైద్యులు నిర్ణయించారు.