బ్రేకింగ్: రెండు రోజులు కర్ణాటక సీఎం క్యాంపు ఆఫీస్ మూసివేత
కరోనా దెబ్బ కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి తాకింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కుటుంబ సభ్యుడికి కరోనా సోకడంతో సీఎం యడ్యూరప్ప క్యాంపు కార్యాలయ భవనాన్ని అధికారులు మూసివేశారు.

కరోనా దెబ్బ కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి తాకింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కుటుంబ సభ్యుడికి కరోనా సోకడంతో సీఎం యడ్యూరప్ప క్యాంపు కార్యాలయ భవనాన్ని అధికారులు మూసివేశారు. రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిలిపివేశారు. శుక్రవారం శానిటైజేషన్ ప్రారంభించామని రెండ్రోజుల్లో తిరిగి కార్యకలాపాలు కొనసాగుతాయని సీఎంవో అధికారులు ప్రకటించారు. సీఎం ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళా సిబ్బంది.. తన భర్తకు కరోనా రావడంతో రెండ్రోజుల కిందటి నుంచే హోం క్వారంటైన్ లో ఉన్నారు. కార్యాలయాన్ని శానిటైజ్ చేయడంలో భాగంగానే భవనాన్ని మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు. రెండు రోజులపాటు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన అధికార కార్యక్రమాలను విధాన్ సౌధ నుంచి నిర్వహిస్తారని వెల్లడించారు.
