AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రోగుల్ని తిప్పి పంపారో ! ఆస్పత్రులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వార్నింగ్ !

ఢిల్లీ లోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చికిత్స కోసం వచ్ఛే కరోనా రోగులను ఏ ఆసుపత్రి అయినా పడకలు లేవని చెప్పి..

కరోనా రోగుల్ని తిప్పి పంపారో ! ఆస్పత్రులకు ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్  వార్నింగ్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 5:41 PM

Share

ఢిల్లీ లోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చికిత్స కోసం వచ్ఛే కరోనా రోగులను ఏ ఆసుపత్రి అయినా పడకలు లేవని చెప్పి.. తిప్పి పంపివేస్తే సదరు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్ఛరించారు. రోగులకు అవసరమైన పడకలపై  నిఘా పెట్టేందుకు ప్రతి ప్రైవేటు ఆసుపత్రి వద్ద మెడికల్ ప్రొఫెషనల్స్ ని నియమిస్తామని ఆయన వెల్లడించారు. కొన్ని హాస్పిటల్స్ కావాలనే తప్పుడు పనులు చేస్తున్నాయి. బెడ్ ల కొరతను సాకుగా చూపి రోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది అని అన్నారాయన. పడకల కొరత వెనుక ఓ మాఫియాహస్తం ఉందని, దానికి కొన్ని పార్టీల మద్దతు ఉన్నట్టు చెప్పిన ఆయన.. ఆ పార్టీల నేతలు తమను రక్షిస్తారని ఈ మాఫియా ముఠా అనుకుంటే అది భ్రమే అవుతుందని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు.  హాస్పిటల్స్ లో పడకల లభ్యతపై కరోనా రోగులకు సమాచారం తెలిపేందుకు ‘ఢిల్లీ కరోనా యాప్’ అనే పేరిట ఓ యాప్ ని కేజ్రీవాల్ ఇటీవలే లాంచ్ చేశారు.

Follow Us
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?