Oxygen Concentrator: ఢిల్లీ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటి వద్దకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ః కేజ్రీవాల్

Balaraju Goud

Balaraju Goud |

Updated on: May 15, 2021 | 3:36 PM

కరోనా రాకాసి విరుచుకుపడుతున్న వేళ శనివారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించాలని నిర్ణయించింది.

Oxygen Concentrator: ఢిల్లీ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటి వద్దకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ః కేజ్రీవాల్
Arvind Kejriwal

Oxygen Concentrator in Delhi: కరోనా రాకాసి విరుచుకుపడుతున్న వేళ శనివారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతిజిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ వాసులకు ఈ రోజు నుంచి ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కోబ్యాంకులో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయని.. కోవిడ్ బాధితులకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ లభించక ఐసీయూల్లో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో అమూల్యమైన మరణాలను కోల్పోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైతే.. రెండు గంటల్లో తమ బృందం హోం డెలివరీ చేస్తుంద సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

ఆసుపత్రుల్లో కోలుకొని వచ్చినవారికి కూడా ఒక్కోసారి ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితి వస్తోంది. అలాంటి వారికి కూడా ఆక్సిజన్ అందించనున్నట్లు సీఎం చెప్పారు. అలాగే, వైద్యులు ఎప్పటికప్పుడు బాధితులను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే.. తక్షణమే తిరిగి చేర్చుకుంటామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. సహాయం కోసం 1031 నంబర్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు

గత కొద్ది వారాల క్రితం ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరగడంతో.. ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధించింది. ఆ అంశం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆప్‌ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘నిన్నటితో పోల్చుకుంటే కొత్త కేసులు మరింత తగ్గాయి. ప్రస్తుతం 6,500 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 11 శాతానికి తగ్గింది. దిల్లీలో మరోసారి కరోనా విజృంభించదని ఆశిస్తున్నాం. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని అన్నారు. ఏప్రిల్‌ 19 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

Read Also….  పశ్చిమ బెంగాల్ లో రేపటినుంచి రెండువారాల పాటు పూర్తి లాక్ డౌన్, అత్యవసర సర్వీసులకు మినహాయింపు,

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu