AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం పేషీలో అధికారి సహా, ఐదుగురికి కరోనా

సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఏపీ సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

సీఎం పేషీలో అధికారి సహా, ఐదుగురికి కరోనా
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2020 | 4:45 PM

Share

సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఏపీ సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

సచివాలయంలో ఔట్‌సోర్సింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు, సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు, ఉన్నత విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ ఉద్యోగి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఉద్యోగితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులు కార్యాలయాలకు రావొద్దని ఉద్యోగుల సంఘం సూచనలు చేసింది. సచివాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. సీఎం పేషీలో పలువురికి కరోనా సోకడం కలవరపెడుతోంది.

Follow Us
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
సినిమా అదిరిపోయిందంటగా..!
సినిమా అదిరిపోయిందంటగా..!
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే
కొత్త రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు
కొత్త రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు