కరోనా టెస్టులపై కేంద్రం కీలక సూచన..లక్షణాలు ఉండి నెగటివ్ వస్తే..
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావడం ప్రభుత్వాలతో పాటు, అటు వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి తరుణంలో వైరస్‌ని అరికట్టడానికి కేంద్రం కీలక సూచనలు చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావడం ప్రభుత్వాలతో పాటు, అటు వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి తరుణంలో వైరస్‌ని అరికట్టడానికి కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా లక్షణాలు ఉండి.. ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ అని తేలిన వారికి తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. పాజిటివ్ కేసులను గుర్తించకపోతే.. బాధితుల ద్వారా ఇతరులకు వైరస్ సోకే ముప్పు ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. దేశంలో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో 60 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం వివరించింది. టెస్టులు ఎక్కువగా చేయాలని.. ముఖ్యంగా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టెస్టులను పెంచాలని కేంద్రం సూచించినట్లుగా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మన దేశంలో అత్యధికంగా కోవిడ్ బారిన పడిన రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి.