రెచ్చిపోయిన యువకులు.. ఏకంగా ఐపీఎస్‌ పైనే దాడి..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఏకంగా పోలీసులపైకే దాడులకు దిగుతున్నారు. తాజాగా యూపీలో ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌పైనే దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే… రాష్ట్రంలోని ఇజ్జత్‌నగర్‌లోని కారంపూర్ చౌదరీ అనే ప్రాంతంలో లాక్‌డౌన్ విధులు నిర్వర్తించేందుకు పోలీసులు అక్కడికి వెళ్లినట్లు సిటీ ఎస్‌పీ రవీంద్ర సింగ్ తెలిపారు. అయితే అక్కడ పరిస్థితులను గమనించేందుకు ప్రత్యేక బలగాలతో ఐపీఎస్ అధికారి అభిషేక్‌ వర్మ ఆ ప్రాంతంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:09 pm, Tue, 7 April 20
రెచ్చిపోయిన యువకులు.. ఏకంగా ఐపీఎస్‌ పైనే దాడి..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఏకంగా పోలీసులపైకే దాడులకు దిగుతున్నారు. తాజాగా యూపీలో ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌పైనే దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే… రాష్ట్రంలోని ఇజ్జత్‌నగర్‌లోని కారంపూర్ చౌదరీ అనే ప్రాంతంలో లాక్‌డౌన్ విధులు నిర్వర్తించేందుకు పోలీసులు అక్కడికి వెళ్లినట్లు సిటీ ఎస్‌పీ రవీంద్ర సింగ్ తెలిపారు. అయితే అక్కడ పరిస్థితులను గమనించేందుకు ప్రత్యేక బలగాలతో ఐపీఎస్ అధికారి అభిషేక్‌ వర్మ ఆ ప్రాంతంలో సందర్శించేందుకు వెళ్లారు. అయితే అక్కడి స్థానికులు కొందరు పోలీసు బలగాలపై దాడులకు దిగాయి. కొందరు యువకులు.. మహిళలు..పోలీసులపై దాడికి
తెగబడ్డారని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో దాడులకు పాల్పడుతున్న వారిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని సిటీ ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనలో.. ఐపీఎస్ అధికారి అభిషేక్‌ వర్మకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే అతడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.అయితే ఈ దాడికి పాల్పడిన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా మిగతా వారిని గుర్తిస్తున్నామన్నారు.