రాజధానిలో కరోనా కేసుల కన్నా,..కోలుకున్న వారే ఎక్కువ!
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,909 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 62,655కి చేరింది. గడిచిన 24 గంటల్లో 58 మంది వైరస్ వల్ల మరణించగా..మొత్తం మృతుల సంఖ్య..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,909 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 62,655కి చేరింది. గడిచిన 24 గంటల్లో 58 మంది వైరస్ వల్ల మరణించగా..మొత్తం మృతుల సంఖ్య2,233కి చేరింది. అయితే, ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న వేళ..రికవరీ శాతం కూడా ఎక్కువగానే ఉండటం ఊరటనిస్తోంది.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల కంటే కూడా.. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇది ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగించే అంశంగా వారు పేర్కొన్నారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 2, 909 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, మరోవైపు 3,589 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా కారణంగా ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 2,233 మంది మృతిచెందగా, 36,602 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 23,820 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 12,922 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. మరోవైపు కరోనా బారిన పడిన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనను ఐసోలేషన్ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్చినట్లు వెల్లడించారు.




