కరోనా ఎఫెక్ట్‌కి 6 నెలల పసిపాప మృతి

| Edited By:

Apr 23, 2020 | 8:24 PM

కరోనా వైరస్‌ కారణంగా ఆరు నెలల పసిపాప మృతి చెందింది. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిలో కరోనా కారణంగా ఆరు నెల పసిపాప మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇటీవలె గుండె ఆపరేషన్‌ కోసం పాపను..

కరోనా ఎఫెక్ట్‌కి 6 నెలల పసిపాప మృతి
Follow us on

కరోనా వైరస్‌ కారణంగా ఆరు నెలల పసిపాప మృతి చెందింది. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిలో కరోనా కారణంగా ఆరు నెల పసిపాప మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇటీవలె గుండె ఆపరేషన్‌ కోసం పాపను ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అయితే పాపలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు కోవిడ్ టెస్ట్ చేశారు. దీంతో పాపకు కరోనా ఉందని తేలింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆ పాప గురువారం కన్నుమూసింది. అయితే పాపకు కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా ఇప్పటికే తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కాగా పంజాబ్‌లో ఇప్పటివరకూ 278 కేసులు నమోదు కాగా.. 16 మంది మరణించారు. అలాగే 15 మంది కోలుకోగా.. ప్రస్తుతం 209 మంది ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం