భారత్‌లో 45కి చేరిన మృతుల సంఖ్య

గత రెండ్రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అయింది. మరణాల సంఖ్య ఇవాళ్టికి 45కి చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 1,418 అని కేంద్రం వెల్లడించింది. పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా బుధవారం ఒక్కరోజే 13 మరణాలు..

భారత్‌లో 45కి చేరిన మృతుల సంఖ్య

Edited By:

Updated on: Apr 01, 2020 | 1:26 PM

భారత్‌లో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు.. కఠిన చర్యలు అమలు పరుస్తున్నాయి. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సీఎంలు తలలు పట్టుకుంటే.. దానికి తోడు ఢిల్లీ మర్కజ్‌‌లో జరిగిన ప్రార్థనలు.. మరింత కలవరం పెడుతున్నాయి. అక్కడ జరిగిన ఓ మత సమావేశానికి హాజరైన వారు.. వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో.. కరోనా కేసులు మరింత ఎక్కువయ్యాయి.

గత రెండ్రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అయింది. మరణాల సంఖ్య ఇవాళ్టికి 45కి చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 1,418 అని కేంద్రం వెల్లడించింది. పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా ఇవాళ ఒక్కరోజే 13 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుని 123 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించింది. అలాగే మరలా కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల కిందటి వరకూ పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపించినా.. ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన ఓ మత సమావేశానికి హాజరైన వారు, వారిని కలిసిన వ్యక్తులు పాజిటివ్ కేసులుగా తేలారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరిన్ని పాజిటివ్ కేసులు వస్తాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’

వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు