విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. డబ్బులు ఫుల్ రీ-ఫండ్..

ఈ నెల 14న లాక్‌డౌన్ ఎత్తేస్తారని లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లాక్ డౌన్‌ను మే 3 వరకూ పొడిగించడంతో అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే టికెట్ల మాదిరిగా తమకూ డబ్బులు రీఫండ్ చేస్తారని విమాన ప్రయాణికులు ఆశించగా.. వారికి షాకిస్తూ కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ‘ప్రియమైన వినియోగదారులా.. మీరు కొన్న టికెట్లకు నో రీఫండ్’ అని హెచ్చరించాయి. ఈ నేపధ్యంలోనే డిప్యూటీ జనరల్ అఫ్ […]

  • Ravi Kiran
  • Publish Date - 8:44 pm, Thu, 16 April 20
విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. డబ్బులు ఫుల్ రీ-ఫండ్..

ఈ నెల 14న లాక్‌డౌన్ ఎత్తేస్తారని లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లాక్ డౌన్‌ను మే 3 వరకూ పొడిగించడంతో అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే టికెట్ల మాదిరిగా తమకూ డబ్బులు రీఫండ్ చేస్తారని విమాన ప్రయాణికులు ఆశించగా.. వారికి షాకిస్తూ కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ‘ప్రియమైన వినియోగదారులా.. మీరు కొన్న టికెట్లకు నో రీఫండ్’ అని హెచ్చరించాయి.

ఈ నేపధ్యంలోనే డిప్యూటీ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ వేళ విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న వారందరికీ డబ్బులు రీఫండ్ ఇవ్వాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు విమానయాన సంస్థలను ఆదేశాలు జారీ చేసింది. టికెట్లు రద్దు చేసుకుంటూ అభ్యర్ధించిన మూడు వారాల్లో వారికి ఫుల్ రీ-ఫండ్ ఇవ్వాలని సూచించింది.

Also Read:

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్‌గా ‘ఆరోగ్య సేతు’ యాప్..

‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?’ గూగుల్‌లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు…

‘వైకుంఠపురంలో’.. అలా తమిళంలో..

ఐపీఎల్ కోసం ఆసియా కప్ రద్దు చేస్తే ఊరుకోం: పాక్ బోర్డు

లాక్ డౌన్ వేళ.. అక్కడ ఇంటికే మద్యం సరఫరా..!