ఇది మన భారతం.. పేదోడి ఆకలి కేకలు.. రోడ్డుపై ఒలికిన పాలకై ప్రయత్నం..

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా పేదోడు ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో అవి ఎవరికీ కనిపించట్లేదు. పట్టెడన్నం కోసం రోజంతా కాయకష్టం చేస్తూ బ్రతికే వేలాది మంది బ్రతుకులు ఈ మహమ్మారి కారణంగా చితికిపోయాయి. పని చేస్తేనే గానీ పూట గడవని వాళ్ల కుటుంబాలు ఆదరించే చెయ్యి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆగ్రాలో రోడ్డుపై ఒలికిన పాలను పేదవాడు ఓ గిన్నెలోకి ఎత్తడానికి ప్రయత్నించాడు. ఇక దీనికి సంబంధించిన […]

ఇది మన భారతం.. పేదోడి ఆకలి కేకలు.. రోడ్డుపై ఒలికిన పాలకై ప్రయత్నం..
Follow us

|

Updated on: Apr 14, 2020 | 9:12 AM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా పేదోడు ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో అవి ఎవరికీ కనిపించట్లేదు. పట్టెడన్నం కోసం రోజంతా కాయకష్టం చేస్తూ బ్రతికే వేలాది మంది బ్రతుకులు ఈ మహమ్మారి కారణంగా చితికిపోయాయి. పని చేస్తేనే గానీ పూట గడవని వాళ్ల కుటుంబాలు ఆదరించే చెయ్యి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఆగ్రాలో రోడ్డుపై ఒలికిన పాలను పేదవాడు ఓ గిన్నెలోకి ఎత్తడానికి ప్రయత్నించాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత శ్రీవత్స ట్వీట్ చేశారు. ‘దేశవ్యాప్తంగా ఆకలి కేకలను చూస్తుంటే గుండె బరువెక్కుతోందని.. నమస్తే ట్రంప్‌కు రోడ్ల చుట్టూ పూల డెకరేషన్‌కు రూ. 3 కోట్లు ఖర్చు చేశారు.. అలాంటిది ఈ పేదోడి ఆకలి తీర్చలేరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.’ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి పేదోళ్ల ఆకలిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

అక్తర్‌కు అఫ్రిదీ వత్తాసు.. మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..