AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. కేవలం ఆరు రోజుల్లోనే.. కరోనాను జయించిన 9 నెలల చిన్నారి..!

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్‌ వ్యాప్తికి మాత్రం ఇంకా అడ్డుపడటం లేదు.

గుడ్‌న్యూస్‌.. కేవలం ఆరు రోజుల్లోనే.. కరోనాను జయించిన 9 నెలల చిన్నారి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2020 | 7:22 AM

Share

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్‌ వ్యాప్తికి మాత్రం ఇంకా అడ్డుపడటం లేదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ మహమ్మారి బారిని పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్‌లో 9 నెలల వయసున్న ఓ పసికందు కరోనాను జయించాడు. కరోనాతో ఆ బాబును ఏప్రిల్ 17న ఆసుపత్రిలో చేర్పించగా.. గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆరు రోజుల్లోనే ఆ చిన్నారి కోవిడ్ నుంచి బయటపడటం విశేషం. 48 గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా నెగిటివ్‌ వచ్చింది.

అయితే ఆ చిన్నారికి తండ్రి ద్వారా కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు తండ్రి తబ్లీగా జమాత్‌కు వెళ్లగా.. కరోనా సోకడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి గురించి ఆసుపత్రి డాక్టర్ ఎన్‌ఎస్‌ ఖాత్రి మాట్లాడుతూ.. నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని అన్నారు. తల్లి సహా ఆ ఇంట్లోని వారందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని. కానీ ఆ చిన్నారి మాత్రమే కరోనా సోకిందని ఆయన తెలిపారు. పాలు తాగే వయసు కావడంతో.. చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్లు వివరించారు.

ఆ చిన్నారిలో కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించలేదని, నవ్వుతూ ఉన్నాడని చికిత్స అందించిన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఆ పసికందు కోసం మందులను ఎక్కువగా వాడలేదని, కరోనా నుంచి ఆ చిన్నారి కోలుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది మొత్తం ఊపిరి పీల్చుకుంది.

Read This Story Also: అందుకే స్మిత్‌ బాల్ ట్యాంపరింగ్ నింద తనపై వేసుకున్నారు: ఆండ్రూ ఫ్లింటాఫ్‌