మంత్రికి కరోనా పాజిటివ్..!

పది రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో ఓ మంత్రికి నెగిటివ్ రాగా.. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ మినిస్టర్‌ జితేంద్ర అవహద్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ పోలీస్ ఆఫీసర్ వలన మంత్రికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్ ఆరంభంలో లాక్‌డౌన్‌, లా అండ్ ఆర్డర్ గురించి చర్చించడానికి ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఓ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను జితేంద్ర […]

మంత్రికి కరోనా పాజిటివ్..!
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 7:47 AM

పది రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో ఓ మంత్రికి నెగిటివ్ రాగా.. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ మినిస్టర్‌ జితేంద్ర అవహద్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ పోలీస్ ఆఫీసర్ వలన మంత్రికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ ఆరంభంలో లాక్‌డౌన్‌, లా అండ్ ఆర్డర్ గురించి చర్చించడానికి ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఓ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను జితేంద్ర కలిశారు. నాసిక్‌ వెళ్లొచ్చిన ఆ పోలీస్‌ ఆఫీసర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ ఆఫీసర్ కాంటాక్ట్ అయిన మంత్రి సహా 100 మందికి థానే మున్సిపల్ అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13న మంత్రికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. తాజాగా పాజిటివ్ వచ్చింది. కాగా దీనికంటే ముందు తన సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకడంతో.. జితేంద్రతో పాటు 15 మంది కుటుంబసభ్యులు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Read This Story Also: గుడ్‌న్యూస్‌.. కేవలం ఆరు రోజుల్లోనే.. కరోనాను జయించిన 9 నెలల చిన్నారి..!