దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. తాజా కేసుల వివరాలు ఇవే..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా నమోదైన కేసులు వివరాలు చూస్తుంటే.. కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అన్నది తెలుస్తుంది. బుధవారం తాజాగా మరో 1813 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో.. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 31787కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో […]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా నమోదైన కేసులు వివరాలు చూస్తుంటే.. కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అన్నది తెలుస్తుంది. బుధవారం తాజాగా మరో 1813 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో.. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 31787కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 1008కి చేరింది. ఇక కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7797 అని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 22,982గా కేంద్రం ప్రకటించింది.



