పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

కరోనా వైరస్ మానవ పేగులపైనా ఇన్‌ఫెక్షన్ చూపిస్తుందని రుజువు చేశారు నెదర్లాండ్‌కి చెందిన పలువురి శాస్త్రవేత్తలు. పేగుల్లోని కణాల్లో ఈ వైరస్ వృద్ధి చెందుతుందని గుర్తించారు. కరోనా వైరస్ రోగుల్లో డయేరియా వంటి జీర్ణాశయ..

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 5:34 PM

కరోనా వైరస్ మానవ పేగులపైనా ఇన్‌ఫెక్షన్ చూపిస్తుందని రుజువు చేశారు నెదర్లాండ్‌కి చెందిన పలువురి శాస్త్రవేత్తలు. పేగుల్లోని కణాల్లో ఈ వైరస్ వృద్ధి చెందుతుందని గుర్తించారు. కరోనా వైరస్ రోగుల్లో డయేరియా వంటి జీర్ణాశయ సంబంధ రుగ్మతలు తలెత్తడానికి కారణాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

సాధారణంగా కరోనా ఉన్న రోగుల్లో జ్వరం, దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి రుగ్మతలు ప్రధానంగా కనిపిస్తాయి. కాగా మరికొందరి రోగుల మలంలోనూ వైరస్ నమూనాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఇప్పుడు పేగుల్లోని కోవిడ్ నమూనాలు ఉన్నాయని తాజా పరిశోధనలో తేల్చారు శాస్త్రవేత్తలు.

ఈ వైరస్ ప్రవేశానికి వీలు కల్పించే ఏసీఈ2 రెసెప్టర్లు.. పేగుల్లోని కణాల్లో ఉన్నాయని తాజాగా తెలిపారు పరిశోధకులు. వీటి ద్వారా గుండెకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశమున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు నెదర్లాండ్ శాస్త్రవేత్తలు. వీటికి కరోనా వైరస్ సోకుతోందని, రోజులు గడిచేకొద్దీ వైరస్ సంఖ్య పెరుగుతోందని గుర్తించారు. ఏసీఈ2 రెసెప్లార్ల స్థాయి ఎక్కువగా ఉన్న కణాలపై ఈ వైరస్ దాడి చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఈ క్రమంలో కోవిడ్ నిర్థారణకు మలం నమూనాలనూ పరిశీలించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.

Read More: షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!