ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2137కి చేరింది. యాక్టివ్ కేసులు 948 ఉండగా.. వైరస్ బారి నుంచి కోలుకుని 1142 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు ఈ మహమ్మారి కారణంగా 47 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా […]

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..
Follow us

|

Updated on: May 13, 2020 | 12:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2137కి చేరింది. యాక్టివ్ కేసులు 948 ఉండగా.. వైరస్ బారి నుంచి కోలుకుని 1142 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు ఈ మహమ్మారి కారణంగా 47 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,01,196 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. అందులో 1,99,059 మందికి నెగటివ్ వచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అనంతపురం 118, చిత్తూరు 142, తూర్పుగోదావరి 51, గుంటూరు 399, కడప 97, కృష్ణా 349, కర్నూలు 591, నెల్లూరు 591, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 66, విజయనగరం 4, పశ్చిమ గోదావరి 68, ఇతర రాష్ట్రాలు 73 కేసులు ఉన్నాయి.

Read This: మద్యంతో కిక్కు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు..