దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. 77 మంది మృతి

| Edited By:

Apr 05, 2020 | 10:16 AM

దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ చాపకింద నీరులాగ ఈ వైరస్ ప్రబలుతూనే ఉంది. మొదట్లో.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. అయితే ఢిల్లీ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లివచ్చిన తరువాత ఈ కేసులు మరింత..

దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. 77 మంది మృతి
Follow us on

కరోనా మహమ్మారి రోజురోజకూ మరింత విజృంభిస్తోంది. గత ఐదు రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్‌లో తబ్లిఘీ జమాత్ మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు మరింత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,374 కరోనా కేసులు నమోదవ్వగా.. 77 మంది మరణించారు. దీని ఎఫెక్ట్ అత్యధికంగా మహారాష్ట్రలో ఉంది.

దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ చాపకింద నీరులాగ ఈ వైరస్ ప్రబలుతూనే ఉంది. మొదట్లో.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. అయితే ఢిల్లీ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లివచ్చిన తరువాత ఈ కేసులు మరింత విజృంభిస్తున్నాయి. తాజగా ఏపీలో 194 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒక వ్యక్తి మరణించాడు. ఇక తెలంగాణలో 272 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకూ 34 మంది కరోనా బాధితులు కోలుకోగా.. 11 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక దేశవ్యాప్తంగా 77 మంది మృతి చెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 24 మంది మృతి చెందగా.. గుజరాత్‌లో 10 మంది,  తెలంగాణలో 11 మంది ఢిల్లీలో ఆరుగురు, మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, పంజాబ్‌లో ఐదుగురు, కర్ణాటకలో ఐదుగురు, తమిళనాడులో నలుగురు, వెస్ట్ బెంగాల్‌లో ముగ్గురు, కేరళలో ఇద్దరు,  ఏపీ, బీహార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

ఈరోజే ‘మోదీ దీపావళి’.. సిద్ధమవుతోన్న భారతీయులు

కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే

మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు

తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి