బ్రేకింగ్: మంగళగిరిలో కోవిడ్ కలకలం.. ఏడుగురు పోలీసులకు కరోనా..

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా కలకలం చోటు చేసుకుంది. 6వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఏడుగురు పోలీసులకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. వెంటనే వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు అధికారులు. అలాగే వారు ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యారో....

బ్రేకింగ్: మంగళగిరిలో కోవిడ్ కలకలం.. ఏడుగురు పోలీసులకు కరోనా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 16, 2020 | 10:47 AM

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా కలకలం చోటు చేసుకుంది. 6వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఏడుగురు పోలీసులకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. వెంటనే వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు అధికారులు. అలాగే వారు ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యారో వారికి కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయనున్నారు వైద్యులు. కాగా అటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటికే క్రితమే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అసెంబ్లీలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం సభ్యులు మాత్రమే అసెంబ్లీకి హాజరు కావాలని.. వారి వెంట ఎవరినీ తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటికే తెలిపారు.

కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. 47మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Read More: 

వాహనదారులపై అధిక భారం.. చమురుధరలపై రూ.2 పెంపు..

నేడు, రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్..