CORONA VACCINATION: దేశంలోకి ఇక వెల్లువలా వ్యాక్సిన్లు.. దేశీయ ఉత్పత్తిలోను భారీ పెరుగుదల?

|

May 13, 2021 | 7:05 PM

మే నెలాఖరు నాటికి దేశంలో వెల్లువలా వ్యాక్సినేషన్ కొనసాగేందుకు చర్యలను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న కోవీషీల్డు, కోవాక్జిన్ వ్యాక్సిన్లకు మరిన్న విదేశీ టీకీలను జత చేసేందుకు యత్నాలను ముమ్మరం..

CORONA VACCINATION: దేశంలోకి ఇక వెల్లువలా వ్యాక్సిన్లు.. దేశీయ ఉత్పత్తిలోను భారీ పెరుగుదల?
Follow us on

CORONA VACCINATION IN INDIA: మే నెలాఖరు నాటికి దేశంలో వెల్లువలా వ్యాక్సినేషన్ కొనసాగేందుకు చర్యలను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT). ఇందులో భాగంగా ప్రస్తుతమున్న కోవీషీల్డు (COVIESHIELD), కోవాక్జిన్ (COVAXIN) వ్యాక్సిన్లకు మరిన్ని విదేశీ టీకాలను జత చేసేందుకు యత్నాలను ముమ్మరం చేసింది. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ (CORONA VIRUS SECOND WAVE) విలయతాండవం చేస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ (VACCINATION) వేగవంతం చేయాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలను టీకాల కొరత ఇబ్బంది పెడుతోంది. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా వ్యాక్సిన్ డోసులు (VACCINE DOSES) తగిన స్థాయిలో సరఫరా కావడం లేదు. దాంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. సడన్‌గా వ్యాక్సిన్ డోసులు లేవంటూ వ్యాక్సినేషన్ సెంటర్లను రోజుల తరబడి క్లోజ్ చేస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో (TELUGU STATES) ఈ మధ్య కాలంలో తరచూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ కోసం కేంద్రంపై రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాజకీయ విమర్శలు, ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం.

ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం (CRUCIAL DECISION) తీసుకుంది. రష్యా (RUSSIA) అభివృద్ధి చేసిన స్పుత్నిక్ (SPUTNIC) వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అంతే కాకుండా అమెరికాకు చెందిన ఎఫ్డీఏ (FDA), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WORLD HEALTH ORGANISATION) అనుమతి పొందిన ఏ వ్యాక్సిన్‌ను అయినా దేశంలోకి దిగుమతి చేసుకునేలా.. అందుకు ఎవరైనా అనుమతి కోరితే ఒకట్రెండు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసేలా కేంద్ర ఆరోగ్య శాఖ (UNION HEALTH MINISTRY) నిబంధనలను సరళీకరించింది. వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటామంటూ ఇంత వరకు ఏ రాష్ట్రమూ కేంద్రాన్ని కోరలేదని… అలాంటి దరఖాస్తులేవీ కేంద్రం దగ్గర ప్రస్తుతం పెండింగులో లేవని కేంద్ర ప్రభుత్వం మే 13న ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంకోవైపు అమెరికా (AMERICA)లో తయారైన ఫైజర్ (FYZER), మోడెర్నా (MODERNA), జాన్సన్ అండ్ జాన్సన్ (JOHNSON AND JOHNSON) కంపెనీల వ్యాక్సిన్లు ప్రస్తుతం భారత్‌లో ప్రబలుతున్న కొత్త రకం కరోనా వేరియెంట్‌ (CORONA NEW VARIENT)పై చక్కగా పని చేస్తాయని నిరూపణ అయినందున వాటిని దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది.

అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ.. దేశీయంగానే వ్యాక్సిన్లను తయారు చేసేందుకు రెడీ అవుతోంది. అమెరికాలో తయారు చేసి.. ఇండియా (INDIA)కు సరఫరా చేసే బదులు మన దేశంలోనే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామంటూ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కేంద్రాన్ని ఇదివరకే కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు (HEALTH DEPARTMENT OFFICIALS) చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోవాక్జిన్, కోవీషీల్డు ఉత్పత్తి గణనీయంగా పెంచాల్సిన అవసరం వున్న నేపథ్యంలో మరిన్ని సంస్థలకు టెక్నాలజీని బదలాయించి.. ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు మొదలయ్యాయి. ఇక రష్యా రూపొందించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ తొలి విడతగా మాస్కో (MASCOW) నుంచి హైదరాబాద్‌ (HYDERABAD)కు ఇదివరకే చేరుకున్నాయి. తాజాగా రెండో విడత డోసులు కూడా రీచ్ అయ్యాయి. హైదరాబాద్ నగరంలోని రెడ్డీస్ లాబోరేటరీ (REDDY’S LABORATORY) స్పుత్నిక్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి కాంట్రాక్టును ఇదివరకే పొందిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో కలిపి స్పుత్నిక్ వ్యాక్సిన్ సుమారు 6 లక్షల డోసులు హైదరాబాద్‌లో ప్రస్తుతం నిల్వ వున్నాయి. వీటి వినియోగానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం పొందడమే తరువాయి పంపిణీకి రంగం రెడీగా వుంది. ఇవన్నీ కలిపితే వచ్చే వారం, పది రోజుల్లో దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్ల పంపిణీ వేగవంతమయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి.

ALSO READ: వ్యాక్సిన్ల సామర్థ్యంపై శుభవార్త.. కరోనా కొత్త వేరియెంట్లను సమర్థవంతంగా నిరోధిస్తున్న అమెరికన్ వ్యాక్సిన్లు

ALSO READ: సెకెండ్ వేవ్‌కు చెక్ వ్యాక్సినేషనే.. కానీ ఉత్పత్తి అంఛనాలు చూస్తే ఏనాటికి సాధ్యం?

ALSO READ: ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ రెడీ.. కానీ మీనమేషాలెందుకంటే?

ALSO READ: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య భీకర పోరు షురూ!