భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే!
సోమవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల మార్క్‌ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 27,892 పాజిటివ్ కేసులు నమోదవ్వగా..

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పటిష్టంగా లాక్‌డౌన్ అమలు పరుస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల మార్క్‌ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 27,892 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 872 మంది కరోనాతో మరణించారు. ఇక 6,185 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 19,868 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా మళ్లీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను చాలా వరకూ సడలించారు. అయితే హాట్ స్పాట్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
అలాగే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 3 సార్లు ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈసారి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారా అని దేశమంతా ఎదురు చూస్తోంది.
Read More:
మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్
అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ



