Covid suicides : కరోనా అనుమానంతో బలవన్మరణాలు.. హన్మకొండ, జనగాం జిల్లాల్లో హృదయ విదారక ఘటనలు

Corona suicides : చనిపోతామన్న భయమే కరోనా వైరస్ సోకిన వాళ్ల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణమవుతుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు.

Covid suicides : కరోనా అనుమానంతో బలవన్మరణాలు.. హన్మకొండ, జనగాం జిల్లాల్లో హృదయ విదారక ఘటనలు
Follow us

|

Updated on: May 18, 2021 | 1:10 PM

Corona suicides : చనిపోతామన్న భయమే కరోనా వైరస్ సోకిన వాళ్ల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణమవుతుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. నాకేం కాదు.. అనే మనో నిబ్బరంతో ధైర్యంగా ఉంటే వైరస్ తోకముడుస్తుందని ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు. అయితే, కొందరు తమకు కరోనా సోకిందేమోనన్న సందేహంతోనే ఆత్మహత్యలకు పాల్పడుతుండటం హృదయ విదారకంగా మారుతోంది. తనకు కరోనా వచ్చిందేమోనని మనోవేదనతో కనకరాజు అనే యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం హిమ్మత్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. అటు, హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన వివాహిత కవిత కూడా ఇలాగే తనువు చాలించడం పరిస్థితికి అద్దం పడుతోంది. కవిత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ తనకు కరోనా వచ్చిందనే అనుమానంతో మనోవేదనకు గురై సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సుబేదారి ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు. కవిత భర్త కిషన్‌కు ఇటీవల కరోనా సోకగా చికిత్స కోసం సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చు అయినట్టు ఎస్సై చెప్పారు. ఇక మరో ఘటన విషయానికొస్తే, జనగామ జిల్లాకు చెందిన కనకరాజు అనే యువకుడి మృతి మరింత దయనీయం.

హిమ్మత్ నగర్ గ్రామస్థుల కథనం ప్రకారం.. నారబోయిన భిక్షపతి చిన్న కుమారుడు కనకరాజు (26) ఎంఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల కాజీపేట మండలం కడిపికొండలో ఉండే బంధువు కరోనాతో మృతిచెందగా కనకరాజు అక్కడికి వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చాక స్వల్పంగా జ్వరం వస్తుండటంతో కొవిడ్‌ సోకిందేమోనని ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. సోమవారం కనకరాజు కనపడకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా తొమ్మిది గంటల ప్రాంతంలో గ్రామ శివారులోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని శవం కాలిపోతోందని తెలిసింది. జఫర్‌గఢ్‌ ఎస్సై కిశోర్‌ స్థలానికి వచ్చి వర్ధన్నపేట ఏసీపీ రమేష్‌, సీఐ విశ్వేశ్వర్‌కు సమాచారం అందించారు. ఆ శవం కనకరాజుదేనని సోదరుడు సంతోష్‌ పోలీసులకు తెలిపారు. ఈ రెండు ఘటనలు ఆయా గ్రామాల్లో తీవ్ర కలవరానికి కారణమయ్యాయి.

Read also : RRR : రఘురామరాజు కేసులో అనూహ్య పరిణామాలు.. సుప్రీం ఆదేశాల మేరకు జ్యుడిషియ‌ల్ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు