వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’

| Edited By:

Mar 31, 2020 | 8:47 AM

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదంటున్నారు. దీంతో ప్రత్యేకంగా క్వారంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఇప్పుడు వెంటిలేటర్ల కొరత తీవ్రంగా..

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా బ్యాగ్ వాల్వ్ మాస్క్
Follow us on

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదంటున్నారు. దీంతో ప్రత్యేకంగా క్వారంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఇప్పుడు వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. వెంటిలేటర్లతో ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల వెంటిలేటర్ల బదులు ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ వాడొచ్చని హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి సూచించారు. దీనికి మాస్క్ అని పేరు పెట్టినా ఇది ఒక రకమైన పరికరమే.

దాదాపు వెంటిలేటర్ అందించే ఉపయోగాలు దీని ద్వారా కూడా లభ్యమవుతాయి. వాటితో పోల్చితే ఇది కాస్త చిన్నవిగా ఉంటాయి. ఎమర్జెన్సీ టైంలో దీని ద్వారా శ్వాస తీసుకునేందుకు వీలుంటుంది. ధర కూడా అందుబాటులో ఉంటుంది. ఒక బ్యాగ్ వాల్వ్ మాస్క్ తయారు చేయడానికి రూ.5 వేల కంటే తక్కువే అవుతుంది. అదే వెంటిలేటర్లకైతే రూ.6 లక్షలు దాకా ఖర్చు అవుతుంది. దీంతో వెంటిలేటర్‌ల కంటే ఇవైతే త్వరగా తయారు చేయవచ్చని, రెండు నెలల్లో ఉత్పత్తి చేపట్టవచ్చని ప్రొఫెసర్లు అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఇప్పుడు వెంటిలేటర్ల తయారీని చేపట్టాలని ఆటోమొబైల్ కంపెనీలను కోరింది. అందుకు ఆ కంపెనీలు కూడా పాజిటీవ్‌గానే స్పందించాయి.

కాగా ప్రస్తుతం ఇండియాలో 40 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. వచ్చే రెండు నెలల్లో 30 వేల వెంటిలేటర్లు తయారు చేయాలని.. ముందుగా ఈ నెల లోపు 10 వేల వెంటిలేటర్లు అందుబాటులోకి రావాలని కేంద్రం అనుకుంటోంది. ఇందుకోసం నోయిడాలోని అగ్వా హెల్త్ కేర్ కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చింది. అలాగే నాణ్యమైన ఎన్-95 మాస్కులను కూడా సిద్ధం చేయమని డీఆర్డీవోను కోరింది కేంద్రం.

ఇవి కూడా చదవండి: వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!